Huzurnagar: హుజూర్‌నగర్‌లో మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన మంత్రి, ఎంపీ!
Huzurnagar: హుజూర్‌నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2,160 మోడల్ కాలనీ ఇళ్ల పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు.
Huzurnagar: హుజూర్‌నగర్‌లో మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన మంత్రి, ఎంపీ!
హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఇల్లు లేని నిరుపేదలకు అతి త్వరలో ఇళ్లను అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం 2160 ఇళ్లకు గాను ఇప్పటికే 1400 కుటుంబాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 360 డిగ్రీల ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి నిజమైన అర్హులైన నిరుపేదలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు త్వరలోనే సిద్ధం చేసి అందజేయనున్నారని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




