Suryapet: సూర్యాపేట జీజీహెచ్ భవన నిర్మాణ పనుల ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
Suryapet: సూర్యాపేటలో 650 పడకల జీజీహెచ్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రూ.1.17 కోట్ల సీఎస్ఆర్ వైద్య పరికరాలను ప్రారంభించారు.
Suryapet: సూర్యాపేట జీజీహెచ్ భవన నిర్మాణ పనుల ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 650 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) భవన నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం జీజీహెచ్ ఆసుపత్రికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఎస్‌బీఐ (SBI), ఐఓసీఎల్ (IOCL), కోటక్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థల సహకారంతో రూ. 1.17 కోట్ల వ్యయంతో సమకూర్చిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఉచితంగా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పేద ప్రజలకు వైద్య రంగంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహలతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




