Nalgonda: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'ప్రజా దర్బార్'

Nalgonda: నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని ఇందిరా భవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Saleem, Nalgonda
Published on: 11 Oct 2026 10:46 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'ప్రజా దర్బార్'

Nalgonda: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌ వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో (ఇందిరా భవన్) నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు.

​బాధితుల ఆర్తిని ఆలకించిన మంత్రి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda