Nalgonda: రూ. 17.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్కు శంకుస్థాపన!
Nalgonda: నల్లగొండలో రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మించే మండల స్థాయి (ఇంటిగ్రేటెడ్) కార్యాలయాల భవన సముదాయ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Nalgonda: రూ. 17.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్కు శంకుస్థాపన!
Nalgonda: నల్లగొండ పట్టణంలో రూ.17.50 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మండల స్థాయి (ఇంటిగ్రేటెడ్) కార్యాలయాల భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అలీ అమేర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.




