Nalgonda: నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి సహాయం!
Nalgonda: నల్లగొండ జిల్లా పనిగిరికి చెందిన మూగ, చెవిటి దంపతుల చిన్నారి వైద్యం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటన.
Nalgonda: నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి సహాయం!
Nalgonda: మరోసారి తనదైన శైలిలో స్పందిస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్‌కుమార్, రజిత దంపతులు మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్నారు. వారి చిన్నారికి వైకల్యం నుంచి విముక్తి కలిగి, మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో, ఆ పేద కుటుంబం ఆర్థిక సాయం కోసం మంత్రిని ఆశ్రయించింది.
బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన మంత్రి, చిన్నారిని స్వయంగా ఎత్తుకుని అక్కున చేర్చుకున్నారు. పాప వైద్య చికిత్స కోసం తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. "మీ బిడ్డ విషయంలో ఆందోళన చెందవద్దు, ఏ సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను" అని ఆ దంపతులకు ధైర్యం చెప్పారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులతో స్వయంగా మాట్లాడి హామీ ఇచ్చారు. క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి ఆదుకున్న మంత్రి కోమటిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




