Suryapet: మేళ్లచెరువులో వైభవంగా వాయులింగ అభిషేకం, గోపూజ!

Suryapet: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో వాయులింగ అభిషేకం, గోపూజ ఘనంగా జరిగాయి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 12 Oct 2026 7:02 PM IST
Suryapet
X

Suryapet: మేళ్లచెరువులో వైభవంగా వాయులింగ అభిషేకం, గోపూజ!

సూర్యాపేట: మేళ్లచెరువు గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకోవడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.

వైభవంగా వాయు లింగ అభిషేకం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకం, అలంకరణ,కుంకుమ పూజ అమ్మవారికి పంచ హారతులు సమర్పించారు. రాహు కేతువులకు అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి మహానివేదన, హారతి సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసిన అనంతరం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రామిరెడ్డి విజయలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ కే భాస్కర్ మిర్యాలగూడ డివిజన్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, కార్యనిర్వహణాధికారి నాగెళ్ల శంబిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెండ్లి లచ్చయ్య, ధర్మకర్తలు , బారెడ్డి వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,రామారావు, దేవమని మాజీ రేనివేషన్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR