Nalgonda: 65వ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Nalgonda: దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రద్దీ పెరిగి గుండ్రపల్లి నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 21 Oct 2026 9:37 PM IST
Nalgonda
X

Nalgonda: 65వ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

నల్లగొండ జిల్లా: దసరా పండుగ సెలవులు ముగియడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ వైపు పయనం కావడం వల్ల హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.గుండ్రపల్లి నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి.

తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.​పెరిగిన రద్దీని తట్టుకునేందుకు పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో 9 టోల్‌ బూత్‌లను తెరచి వాహనాలను పంపిస్తున్నారు.

చౌటుప్పల్,ధర్మోజి గూడెం వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల వాహనదారులు తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు.గడిచిన 10 రోజులలో దసరా పండుగ సందర్భంగా ఈ జాతీయ రహదారిపై సుమారు 6 లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET