Suryapet: తిర్మలగిరి మార్కెట్ యార్డ్ వద్ద ‘సేవ్ మార్కెట్’ భారీ ర్యాలీ!

Suryapet: సూర్యాపేట జిల్లా తిర్మలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను కాపాడుకోవాలని ‘సేవ్ మార్కెట్’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 28 Nov 2026 12:44 PM IST
Suryapet
X

Suryapet: తిర్మలగిరి మార్కెట్ యార్డ్ వద్ద ‘సేవ్ మార్కెట్’ భారీ ర్యాలీ!

Suryapet: సూర్యాపేట జిల్లా తిర్మలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో మార్కెట్ యార్డ్ ఎదుట ‘సేవ్ మార్కెట్’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌ను కొనసాగిస్తూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులు, హమాలీలు, గుమస్తాలు, స్వీపర్లు, దడువాయిలు ఐక్యంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్తాలు ఏవైనా సరే మార్కెట్‌ను కొనసాగించుకుందామని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నినాదాలు చేశారు. రైతు శ్రేయస్సే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం పూర్తిస్థాయిలో గోనె సంచులను సమకూర్చడం సాధ్యం కావడం లేదని, అందువల్ల గోనె సంచులతో పాటు ప్లాస్టిక్ సంచులను కూడా వినియోగిస్తూ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం ఎగుమతులు కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో హమాలీలు సహకరించాలని కోరారు.

వ్యవసాయ మార్కెట్ మనుగడ సాగిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని, మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న అనేక వర్గాల ఉపాధి కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా ముందుకు వచ్చి మార్కెట్‌ను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy