Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల భాగోతం వెలుగులోకి!

Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కామ్ వెలుగుచూసింది. తప్పుడు పత్రాలతో కారుణ్య నియామకం పొందడంపై కమిషనర్ వంశీకృష్ణ క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు.

Saleem, Nalgonda
Published on: 3 Nov 2026 10:37 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల భాగోతం వెలుగులోకి!

Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో భారీగా వెలుగుచూసిన అక్రమాలు. ​ లంచాలు ఇస్తే కోరిన తేదీతో డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్న మున్సిపల్ సిబ్బంది. ​పదవీ విరమణ తర్వాత మృతిచెందిన హెల్త్ అసిస్టెంట్ చామకూరి వెంకటేశ్వర్లు. కానీ సర్వీస్‌లో ఉండనే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు తప్పుడు పత్రాలతో డెత్ సర్టిఫికెట్ పొందిన కుటుంబసభ్యులు.

​ఎలాంటి పరిశీలన లేకుండానే తప్పుడు తేదీతో డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన నల్లగొండ మున్సిపల్ సిబ్బంది. అక్రమ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఆధార్‌తో కారుణ్య నియామకం పొందిన మృతుడి కుమారుడు రాజు. ​తప్పుడు పత్రాలతో వైద్యా ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం పొందిన మృతుడి కుమారుడు రాజు.

ఈ నకిలీ పత్రాల వెనుక డిఎంహెచ్ఓ సీసీ, సూపర్ డెంట్ లు ముఖ్య పాత్ర పోషించినట్లు సమాచారం. అక్రమ డెత్ సర్టిఫికెట్ జారీ పై తీవ్రంగా స్పందించిన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ. మృతుడి భార్య వసంత, హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిపై క్రిమినల్ కేసులకు కమిషనర్ సిఫార్సు.

​సానిటేషన్ ఇనిస్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ జనార్ధన్ సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ ఖాదీర్ కు షోకాజ్ నోటీసులు. సమగ్ర విచారణకు మున్సిపల్ కమిషనర్ ఆదేశం.DMHO ఆఫీస్ లో జరుగుతున్నా అవినీతి అక్రమాలపై వార్తలు రాసిన జర్నలిస్ట్ లకు కులం పేరుతో బేరింపులు.

నల్గొండ డిఎంహెచ్వో కార్యాలయంలో మరియు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై హెచ్ఎంటివి స్పెషల్ ఫోకస్.

Saleem, Nalgonda

Saleem, Nalgonda