Miryalaguda: మిర్యాలగూడలో భారీ కార్డన్ అండ్ సెర్చ్..106 బైక్లు సీజ్!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాళ్లగడ్డ కాలనీలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 106 బైక్లు, ఆటోలు, కారును సీజ్ చేశారు.
Miryalaguda: మిర్యాలగూడలో భారీ కార్డన్ అండ్ సెర్చ్..106 బైక్లు సీజ్!
Miryalaguda: మిర్యాలగూడ పట్టణం తాళ్ల గడ్డ కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. గస్తీలో భాగంగా కాలనీలో మొత్తం ద్విచక్ర వాహనాలు 106, నాలుగు ఆటోలు, ఒక కారు సీజ్ చేసి అందులో సరైన పత్రాలు లేని వాహనాలకు చలానా విధించారు.సెర్చ్ లో పాల్గొన్న మిర్యాలగూడ డి.ఎస్.పి, మరియు డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఐదుగురు సిఐలు 20 మంది ఎస్ఐలు మరియు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీ. రవి మాట్లాడుతూ కాలనీలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా కిరాయికి ఇల్లు కావాలని వస్తే పూర్తి స్థాయిలో వారిపై విచారణ చేసి ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా యువత కూడా మత్తుకు బానిసకి గురవుతున్నారని వారి పట్ల కూడా తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు. మత్తుకు సంబంధించిన విక్రయాలు జరిపితే పోలీస్ శాఖ నుండి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ప్రజలు కూడా వారి పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.




