Nakrekal: నకిరేకల్‌లో 104 మందికి సామూహిక సీమంతాలు!
Nakrekal: నకిరేకల్‌లోని సువర్ణ గార్డెన్‌లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 104 మంది మహిళలకు సామూహిక సీమంతాలు ఘనంగా జరిగాయి.
Nakrekal: నకిరేకల్‌లో 104 మందికి సామూహిక సీమంతాలు!
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 104 మంది మహిళలకు సామూహిక సీమంతాల వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణులకు పసుపు, కుంకుమ, చీరలు, పండ్లను అందజేసి ఎమ్మెల్యే ఆశీర్వదించారు. మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ కోసం వాసవి క్లబ్ నిరంతరం చేస్తున్న ఇలాంటి మహోన్నత సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్దా వెంకట సూర్య ప్రకాశరావు, గజ్జల రామకృష్ణ, గవర్నర్ వీరెల్లి సతీష్ కుమార్‌లతో పాటు క్లబ్ ప్రతినిధులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.




