Chityala: చిట్యాలలో మలిదశ ఉద్యమకారుడు మంద వేణుగోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 5 Nov 2026 8:16 AM IST
Chityala
X

Chityala: చిట్యాలలో మలిదశ ఉద్యమకారుడు మంద వేణుగోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్!

Chityala: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కుల కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్న నాయకుడిపై ఈ విధమైన పోలీసు చర్యలు చేపట్టడం సరికాదు హక్కుల సాధన కోసం ప్రశ్నిస్తున్న ఉద్యమకారుల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతోంది.

పోలీసు బలగాలతో ఉద్యమకారుల ఇళ్లపై పడి, భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడమే. ఇలాంటి అక్రమ అరెస్టులకు, బెదిరింపులకు మలిదశ ఉద్యమకారులు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిచారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA