Kodad: మహిళపై దాడి, ఇంట్లోకి అక్రమ ప్రవేశం.. నిందితుడికి మూడేళ్ల జైలు
Kodad: మహిళపై దాడి, ఇంట్లోకి అక్రమ ప్రవేశం కేసులో భీక్యాతండా వాసి బానోతు వెంకన్నకు కోదాడ కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది.
Kodad: మహిళపై దాడి, ఇంట్లోకి అక్రమ ప్రవేశం.. నిందితుడికి మూడేళ్ల జైలు
కోదాడ: మహిళపై దాడి చేసి, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన కేసులో నిందితుడికి కోదాడ కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన క్రైమ్ నంబర్ 346/2017 కేసులో గురువారం ఈ తీర్పు వెలువడింది.
కోడాడలోని ప్రథమ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి మొహమ్మద్ ఉమర్ కేసును విచారించి నిందితుడు భీక్యాతండాకు చెందిన బానోతు వెంకన్న (తండ్రి లాల్య) నేరం చేసినట్లు నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా, సెక్షన్ 448 కింద ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.
సంఘటన జరిగి సుమారు తొమ్మిదేళ్లు గడవడం, నిందితుడి వయస్సు, కేసు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది (APP) కె. కళ్యాణి వాదనలు వినిపించగా, కేసు విచారణకు సహకరించిన కోదాడ రూరల్ ఎస్‌ఐ ఎస్‌కే యాకూబ్, కోర్టు కానిస్టేబుల్ పి. నరేష్‌లను పోలీసు అధికారులు అభినందించారు.




