Suryapet: ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. నాగారపు పాండు!
Suryapet: నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ మాజీ నాయకులు నాగారపు పాండు పిలుపునిచ్చారు.
Suryapet: ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. నాగారపు పాండు!
Suryapet: నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ మాజీ డివిజన్ నాయకులు నాగారపు పాండు పిలుపునిచ్చారు.
మహాసభల సందర్భంగా నవంబర్ 15న 10 వేల మందితో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, భారీ రైతు ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
హుజూర్‌నగర్ పట్టణం నుంచి 200 మంది యువతీ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి రూ.50 వేల కోట్ల కరువు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఇందిరాల నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పల్లె వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్, పట్టణ కార్యదర్శి మీసాల వీరబాబు, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి లోహిత్, రామాల అనిల్, గొబ్బి రాము, నక్కెనబోయిన శంకర్, అనిల్, దుగ్గి ప్రవీణ్, విజయ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




