Nalgonda: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పీజీ పరీక్షల ఫలితాలు విడుదల!

Nalgonda: ఎంజీ యూనివర్సిటీ పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు విడుదల. 4వ సెమిస్టర్‌లో 76.44% ఉత్తీర్ణత నమోదు: రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 7:30 PM IST
Nalgonda
X

Nalgonda: మహాత్మా గాంధీ యూనివర్సిటీ పీజీ పరీక్షల ఫలితాలు విడుదల!

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐ, ఐఐ, ఐఐఐ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు.

​ఈ సందర్భంగా సీఓఈ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ... పీజీ నాల్గో సెమిస్టర్‌లో మొత్తం 1,265 మంది విద్యార్థులకు గానూ 967 మంది (76.44%) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇక బ్యాక్‌లాగ్ ఫలితాల్లో మొదటి సెమిస్టర్‌లో 427 మందికి 158 మంది (37%), రెండో సెమిస్టర్‌లో 382 మందికి 65 మంది (17.02%), మూడో సెమిస్టర్‌లో 344 మందికి 168 మంది (48.84%) పాసైనట్లు వివరించారు.

​విద్యార్థులు పూర్తి వివరాలను ఎంజీయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డాక్టర్ డి. సంధ్యారాణి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda