Nalgonda: మహర్షి వాల్మీకి ఆశయాలు ఆదర్శప్రాయం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

Nalgonda: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 26 Oct 2026 2:26 PM IST
Nalgonda
X

Nalgonda: మహర్షి వాల్మీకి ఆశయాలు ఆదర్శప్రాయం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

​నల్లగొండ జిల్లా​: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. రామాయణం ద్వారా ధర్మం, నైతిక విలువలను చాటిచెప్పిన ఆదికవి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda