Tungathurthi: మద్దిరాలలో గోశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన సర్పంచ్

Tungathurthi: సూర్యాపేట జిల్లా మద్దిరాల ఆలయ సమీపంలో గోశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్ రాంపాక నాగరాజు; పాల్గొన్న అర్చకులు, గ్రామస్తులు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 22 Nov 2026 6:42 PM IST
Tungathurthi
X

Tungathurthi: మద్దిరాలలో గోశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన సర్పంచ్

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా.. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో గోశాల నిర్మాణం చేపట్టేందుకు గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో గోశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు రాజోలు ప్రసాద్ శర్మ, వడ్డాణం మధుసూదన్, మల్లాల నర్సయ్య, సాధు రఘు, శేరి దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బత్తిని గిరి, శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy