Thungathurthy: తుంగతుర్తి నియోజకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన మల్లారపు కృష్ణ
Thungathurthy: మద్దిరాల గౌడ సంఘ అధ్యక్షుడిగా మల్లారపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కులస్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Thungathurthy: తుంగతుర్తి నియోజకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన మల్లారపు కృష్ణ
Thungathurthy: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల గ్రామ గౌడ కులస్తుల సంఘం అధ్యక్షుడిగా మల్లారపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ కులస్తులు, గ్రామ పెద్దలు ఆయనకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మల్లారపు కృష్ణ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌడ కులస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, గౌడ కులస్తుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తానని, కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
గ్రామంలోని గౌడ కులస్తులందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మల్లారపు కృష్ణ ఎన్నికతో గ్రామ గౌడ కులస్తుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద గౌడు చామకూరి నాగరాజు, సా రకొల్లా గౌడు బోలగని సోమయ్యతో పాటు పలువురు గ్రామ పెద్దలు, గౌడ కులస్తుల సంఘం సభ్యులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.




