Maddirala: రాహుల్ అరెస్టుకు నిరసనగా మద్దిరాలలో కాంగ్రెస్ ధర్నా!

Maddirala: రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 8 Oct 2026 4:41 PM IST
Maddirala
X

Maddirala: రాహుల్ అరెస్టుకు నిరసనగా మద్దిరాలలో కాంగ్రెస్ ధర్నా!

మద్దిరాల: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.పేద ప్రజల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారని, ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

ఎస్‌ఐఆర్‌ (SIR) కార్యక్రమంలో భాగంగా జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే బర్తరఫ్ చేసి, పేద ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని మధిరాల మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy