Chilakamarri: మద్దిమడుగు ఆంజనేయ స్వామి దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Chilakamarri: చిలకమర్రి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి శివయ్య చారి ఆధ్వర్యంలో మద్దిమడుగు ఆంజనేయ స్వామి దీక్ష మాలధారణ పోస్టర్ ఆవిష్కరించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 1 Nov 2026 3:29 PM IST
Chilakamarri
X

Chilakamarri: మద్దిమడుగు ఆంజనేయ స్వామి దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Chilakamarri: గుడిపల్లి మండలం చిలుకమర్రిస్టేజి శ్రీశ్రీశ్రీ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దీక్ష వ్యవస్థాపకులు.శ్రీ కేతావత్ జయరాం గురుస్వామి గారి ఆదేశాల అనుసారముగా. హనుమాన్ శక్తి జాగరణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరం శివయ్య చారి గురుస్వామి. పీ.ఏ.పల్లి గారిచే మరియు హనుమాన్ శక్తి జాగరణ సమితి.పీ.ఏ. పల్లి.మండల అధ్యక్షులు గుండాల. శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో. చిలకమర్రి శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో గోడపత్రికని ఆవిష్కరించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో మహేశ్వరం శివయ్యచారీ చారి గురుస్వామి మాట్లాడుతూప్రతి సంవత్సరం మాదిరిగానే. శ్రీ మద్దిమడుగు ఆంజనేయస్వామి దీక్ష మాల ధారణ చేసుకొని ప్రతి ఒక్కరూ పునీతులు కావాలని కోరారు.

ఈ సంవత్సరము గ్రామీణ ప్రజలకు ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు సకాలంలో పడకపోవడం పంటలు పండక పోవడంవల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో. దీక్ష తీసుకుని స్వాములు అధిక ఖర్చులు చేయకుండా స్వామి వారిపై భక్తి విశ్వాసాలతో. మీ శక్తి కొలది. సమర్పించుకొని ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను.

ఇట్టి కార్యక్రమంలో మూనా సార్ స్వామి గారు. తిరుమల్.స్వామి గారు. శివ స్వామి గారు. కొండల స్వామి గారు. అంజి స్వామి గారు. శశి స్వామి గారు. యాదగిరి స్వామి గారు. శేఖర్ స్వామి గారు. లాలూ స్వామి గారు. శ్రీను స్వామి గారు. ఆంజనేయులు స్వామి గారు పాల్గొని మద్దిమడుగు వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA