Nalgonda: బతుకమ్మ కుంటను శుభ్రం చేయాలని స్థానికుల డిమాండ్!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని బతుకమ్మ కుంటలో పేరుకుపోయిన వ్యర్థాలు. సద్దుల బతుకమ్మ వేడుకల వేళ కుంటను తక్షణమే శుభ్రం చేయాలని అధికారులను కోరుతున్న స్థానికులు.
Nalgonda: బతుకమ్మ కుంటను శుభ్రం చేయాలని స్థానికుల డిమాండ్!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని బతుకమ్మ కుంట వ్యర్థాలతో నిండి అపరిశుభ్రంగా మారింది. నీటి ఎద్దడి నివారణకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చొరవతో సాగర్ నీటిని నింపినప్పటికీ, నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల అవశేషాలు, పాత బతుకమ్మల పూలు, పూజా సామాగ్రిని తొలగించకపోవడంతో చెత్త కుప్పగా తయారైంది. త్వరలోనే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నందున మహిళలు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి కుంటను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.




