Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహార వితరణ!
Miryalaguda: మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు అల్పాహార వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహార వితరణ!
Miryalaguda: ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని అన్ని లయన్స్ క్లబ్స్ సంయుక్తంగా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో శనివారం అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం 1311వ రోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా రోగులు, వారి సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు.
మెయిన్ లయన్స్ క్లబ్కు చెందిన పగిడిమర్రి హరిశంకర్ బ్రహ్మ 31వ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన తల్లిదండ్రులు పగిడిమర్రి పద్మ, గోవర్ధన్ చారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా ఆసుపత్రిలోని వారికి అల్పాహారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షుడు MJF లయన్ కుటాల రాంబాబు, కార్యదర్శి లయన్ మెరెడ్డి సత్యనారాయణ రెడ్డి, లయన్ పగిడిమర్రి గోవర్ధన్ చారి, జోన్ చైర్మన్ MJF లయన్ బి.ఎం. నాయుడు, MJF లయన్ యనగండ్ల లింగయ్య, MJF లయన్ డాక్టర్ జె. రాజు, PMJF లయన్ ఏచూరి మురహరి, PMJF లయన్ ఆర్.సి. ఏచూరి భాగ్యలక్ష్మి, MJF లయన్ అనుముల సైదిరెడ్డి, లయన్ కర్ర రాంరెడ్డి, లయన్ బిక్కుమల్ల ఆనంద్, లయన్ వెంకట్ రామ్, లయన్ వంగాల లక్ష్మారెడ్డి, లయన్ నక్క మంగాత, సోమవాణి తదితరులు పాల్గొన్నారు.




