Mellacheruvu: మేళ్లచెరువులో వైభవంగా లక్ష బిల్వార్చన, మహా రుద్రాభిషేకం

Mellacheruvu: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష బిల్వార్చన, మహా రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 12 Nov 2026 7:28 PM IST
Mellacheruvu
X

Mellacheruvu: మేళ్లచెరువులో వైభవంగా లక్ష బిల్వార్చన, మహా రుద్రాభిషేకం

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు గ్రామంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం నిర్వహించారు. అనంతరం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 121 రుద్రాలతో మహా రుద్రం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి లక్ష బిల్వార్చనను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహా నివేదన, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి నాగేళ్ల శంభిరెడ్డి, ప్రధాన అర్చకులు కొంకపాక విష్ణువర్ధన శర్మ, కొంకపాక ధనుంజయ శర్మ, దేవస్థాన కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR