Nakrekal: నకిరేకల్ పెద్దచెరువులోకి కృష్ణా జలాలు: ప్రజల్లో ఆనందోత్సవాలు!

Nakrekal: నకిరేకల్ పెద్దచెరువులోకి కృష్ణా జలాలు చేరి చెరువు నిండటంతో పట్టణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 Nov 2026 1:08 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ పెద్దచెరువులోకి కృష్ణా జలాలు: ప్రజల్లో ఆనందోత్సవాలు!

Nakrekal: నకిరేకల్ పట్టణంలోని పెద్దచెరువులోకి కృష్ణా జలాలు చేరి చెరువు నిండటంతో పట్టణ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎండిపోయిన చెరువుకు జలకళ సంతరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చెరువులోని అలుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌగోని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుచూపు, ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగానే కృష్ణా జలాలు నకిరేకల్ నియోజకవర్గానికి చేరుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే నీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసి, నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని నీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నప్పటికీ, కృష్ణా జలాల రాకతో నకిరేకల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరిందన్నారు.

ముఖ్యంగా చెరువులు, కుంటల్లో నీరు నిల్వ ఉండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి బోర్లలో నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా తాగునీటి అవసరాలతో పాటు వ్యవసాయానికి కూడా భరోసా లభిస్తుందని తెలిపారు.

నీటి వనరులను కాపాడుకోవడం, భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ.. నకిరేకల్ పెద్దచెరువుకు కృష్ణా జలాలు చేరడం పట్టణానికి శుభపరిణామమని అన్నారు. ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృషి చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL