Nalgonda: నల్గొండలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు!

Nalgonda: నల్గొండ పట్టణంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్, డీసీసీ అధ్యక్షుడు.

Saleem, Nalgonda
Published on: 27 Sept 2026 11:28 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు!

Nalgonda: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు క్రీ.శే. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాల కేంద్రం వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda