Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం..మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా సవరణ (SIR) 89.54% పూర్తి. భూభారతి దరఖాస్తుల్లో 99.21% పరిష్కరించామని వెల్లడించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Saleem, Nalgonda
Published on: 17 Sept 2026 1:59 PM IST
Nalgonda
X

Nalgonda: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం..మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 89.54 శాతం మంది ఓటర్ల డేటాను డిజిటలైజ్ చేశామని, మొత్తం 13,57,618 మంది ఓటర్ల పేర్లను సమగ్రంగా నమోదు చేసినట్లు వివరించారు.

​రెవెన్యూ, భూపరిపాలన అంశాలపై సమీక్షిస్తూ.. ‘భూభారతి’ పోర్టల్ ద్వారా జిల్లాలో 1,60,517 దరఖాస్తులు రాగా, అందులో 99.21 శాతం అర్జీలను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పరిష్కరించామని వెల్లడించారు. అలాగే సాదా బైనామా కింద అందిన 28,313 దరఖాస్తులకు గాను 27,123 వినతులను విజయవంతంగా పరిష్కరించి బాధితులకు హక్కులు కల్పించామని మంత్రి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda