Nalgonda: సీఎం శాఖలోనే వేల కోట్ల దోపిడీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!
Nalgonda: సీఎం రేవంత్ రెడ్డి శాఖలోనే వేల కోట్ల దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక.
Nalgonda: సీఎం శాఖలోనే వేల కోట్ల దోపిడీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!
Nalgonda: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఒ మీడియా తో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ఈ అక్రమాలపై నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా, రేడియల్ రోడ్డు టెండర్ల వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. న్యాయం తమ వైపే ఉందని, ఈ పోరాటాన్ని చివరి వరకు వదిలేది లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.




