Kodad: మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ
Kodad: కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన 'మాదక ద్రవ్యాలపై యుద్ధం' డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆవిష్కరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ.
Kodad: మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ
కోదాడ: మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన మాదక ద్రవ్యాలపై యుద్ధం డాక్యుమెంటరీ,పోస్టర్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆవిష్కరించారు.
బచ్చలకూర సురేష్ స్వయంగా రచించిన ఈ డాక్యుమెంటరీలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్యపరచడంతో పాటు, వాటి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కొత్తపల్లి నరసింహ బచ్చలకూర సురేష్‌ను శాలువాతో సన్మానించి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల్లో అవగాహన కల్పించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లె విద్యాసాగర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.




