Kodad: కోదాడలో 4,670 చేయూత పెన్షన్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడలో అర్హులైన లబ్ధిదారులకు 4,670 చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అందజేశారు.
Kodad: కోదాడలో 4,670 చేయూత పెన్షన్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్‌ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన 4,670 చేయూత పెన్షన్ల పత్రాలను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి స్వయంగా అందజేశారు. పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.




