Nalgonda: ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పుష్పాభిషేకం!
Nalgonda: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో చెరువులకు కృష్ణా జలాలు మళ్లింపు. ఎల్‌నినో ప్రభావం వేళ ముందుచూపుతో చెరువులు నింపిన ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పుష్పాభిషేకం.
Nalgonda: ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పుష్పాభిషేకం!
Nalgonda: కేతేపల్లి మండలం చెరువులు, కుంటలకు కృష్ణా జలాలు చేరడంతో జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా కేతపల్లి మండలంలోని పలు గ్రామాల చెరువులు నీటితో కళకళలాడుతూ అలుగులు పారుతున్నాయి. దీంతో గ్రామాల్లో తాగునీటి సమస్యకు ఉపశమనం కలగడంతో పాటు భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఏర్పడింది.
కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలోని నల్లచెరువు వద్ద గ్రామస్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలను గ్రామ చెరువులకు మళ్లించడంలో కృషి చేసిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజార్ల శంభయ్య, గ్రామ సర్పంచ్ బొజ్జ సుందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ, ముందస్తు ప్రణాళికతో కృష్ణా జలాలను ఐటిపాముల చెరువు ద్వారా కేతపల్లి మండలంలోని వివిధ గ్రామాల చెరువులు, కుంటలకు మళ్లించి నీటిని అందిస్తున్నారని తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు తీరడంతో పాటు పశువులకు నీటి లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ముందుచూపుతో చెరువులను నీటితో నింపడం అభినందనీయమన్నారు. చెరువుల్లో నీటి నిల్వలు పెరగడం వల్ల భూగర్భ జలమట్టాలు మెరుగుపడి, బోర్లు, బావుల్లో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తగ్గడంతో పాటు పశువుల అవసరాలకు కూడా నీరు అందుబాటులో ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
గ్రామాల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జలాలను చెరువులకు మళ్లించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లచెరువు వద్ద పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే చిత్రపటంపై పూలు చల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.




