Ketepalli: మూసి గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

Ketepalli: కేతేపల్లి మండలం మూసి గురుకుల పాఠశాలలో సీనియర్ సివిల్ జడ్జ్ మంజుల ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 14 Nov 2026 7:26 PM IST
Ketepalli
X

Ketepalli: మూసి గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

కేతేపల్లి: కేతేపల్లి మండలం మూసి గురుకుల పాఠశాలలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జ్ కుమారి మంజుల మూసీ ప్రాజెక్ట్ లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు (లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం) ప్రిన్సిపాల్ వి. సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కుమారి మంజుల హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ప్రాథమిక హక్కులు మరియు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ముఖ్యంగా పోక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు.

ఆపద సమయంలో పోలీసుల సహాయం మరియు ఉచిత న్యాయ సేవాధికార సంస్థ (DLSA) సేవలను ఎలా పొందాలో వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల నిర్వహణ సంబంధిత రికార్డులు రిజిస్టర్లు భోజనం క్వాలిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ కే. బిక్షమయ్య , అడ్వకేట్ గోవింద రాజులు, వెంకన్నగారు, ఉదయ్ కుమార్., టైపిస్ట్ సుజాత ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL