Kattamguru: ఎంపీడీఓ కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం - నిలిచిన పెన్షన్లు

Kattamguru: నల్గొండ జిల్లా కట్టంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌ను విస్మరించి ఉప సర్పంచ్ పెన్షన్ పత్రాలు ఇవ్వడంతో చెలరేగిన ప్రోటోకాల్ వివాదం కారణంగా పంపిణీ నిలిచిపోయింది.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 17 Nov 2026 6:21 PM IST
Kattamguru
X

Kattamguru: ఎంపీడీఓ కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం - నిలిచిన పెన్షన్లు

కట్టంగూరు: కట్టంగూరు మండల కేంద్రంలో MPDO ఆఫీసులో జరిగిన నూతన పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో , ప్రోటోకాల్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు తలెత్తింది. ​వేదికపై మహిళా సర్పంచ్ పక్కనే ఉన్నప్పటికీ, ఆమెను పూర్తిగా విస్మరించి ఉప సర్పంచ్ లబ్ధిదారులకు పింఛన్ ఆర్డర్ కాపీలను అందజేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

​సర్పంచ్ అక్కడే ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉప సర్పంచ్‌కు సహకరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ​ఈ ప్రోటోకాల్ వివాదం సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదానికి మరియు ఘర్షణకు దారితీసింది.

​వివాదం మరింత ముదరడంతో పంపిణీ చేయాల్సిన ఆర్డర్ కాపీలను నిలిపివేశారు. ​ ప్రోటోకాల్ వివాదాల మధ్య తమ పేర్లపై వచ్చిన పింఛన్ ఆర్డర్లను ఆపడం వల్ల తమ పొట్ట కొట్టి అన్యాయం చేయవద్దని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL