Tungaturthi: కాళోజి ఆశయాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: సీతయ్య
Tungaturthi: కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో తాటికొండ సీతయ్య, నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Tungaturthi: కాళోజి ఆశయాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: సీతయ్య
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి: స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ప్రజల్లో రగిలించిన మహాకవి, ప్రజాకవి కాళోజి నారాయణరావు అని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కొనియాడారు.కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. “పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా సమాజానిది” అనే సందేశంతో పాటు 'నా గొడవ' వంటి రచనల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను రగిలించిన మహాకవి కాళోజి నారాయణరావు అని అన్నారు. తెలంగాణ యాస, భాషలో తన కవిత్వంతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప కవి, పోరాటయోధుడు అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కాళోజి చేసిన కృషి అజరామరమని, ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు ఉప్పుల నాగమల్లు, తెడ్డు హరిబాబు, గుగులోతు హేమానాయక్ తదితరులు పాల్గొన్నారు.




