Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె!
Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపోలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు శనివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. అకారణంగా డ్యూటీలు నిలిపివేయడంపై ఆందోళన చేపట్టారు.
Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె!
Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపోలో శనివారం ఉదయం 4 గంటల నుంచి జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. యాజమాన్యం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అకారణంగా డ్యూటీలను నిలిపివేసిందని ఆరోపిస్తూ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు.
బాధితులను వెంటనే విధుల్లోకి తీసుకునే వరకు తాము బస్సులు తీసేది లేదని స్పష్టం చేశారు. జేబీఎం, సిస్కాన్ మ్యాన్‌పవర్ సంస్థలు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.




