Chintalapalem: చింతలపాలెంలో శివగంగా లిఫ్ట్ సమస్యలపై అధికారుల సమీక్ష!

Chintalapalem: హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెంలో శివగంగా లిఫ్ట్ సమస్యలపై అధికారుల సమీక్ష. ఐదు రోజుల్లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఈఈ రామ్‌కిషోర్ హామీ.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 12 Oct 2026 1:41 PM IST
Chintalapalem
X

Chintalapalem: చింతలపాలెంలో శివగంగా లిఫ్ట్ సమస్యలపై అధికారుల సమీక్ష!

Chintalapalem: శివగంగా లిఫ్ట్‌ నిర్వహణలో నెలకొన్న సమస్యలతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిఫ్ట్‌ ద్వారా సాగునీరు అందించే విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శివగంగా లిఫ్ట్‌ నిర్వహణపై ఇరిగేషన్‌ అధికారులు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో లిఫ్ట్‌ నిర్వహణలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. మరో ఐదు రోజుల్లో చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్‌ ఈఈ రామ్‌కిషోర్‌ తెలిపారు. లిఫ్ట్‌ నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు అదనపు ఆపరేటర్‌ను నియమించడంతో పాటు, లస్కర్లకు షిఫ్టుల వారీగా విధులు కేటాయిస్తామని వెల్లడించారు.

అలాగే లిఫ్ట్‌ పరిసరాల్లో పర్యవేక్షణను పెంచేందుకు ఎస్సై పరమేష్‌ సమన్వయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లిఫ్ట్‌ నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని, వాట్సాప్‌ గ్రూపుల్లో అనవసర చర్చలు చేయవద్దని ఎస్సై పరమేష్‌ సూచించారు.

ఈ సమావేశంలో డీఈ హరికృష్ణ, ఏఈ శ్రీనివాస్‌, లిఫ్ట్‌ చైర్మన్‌ గుడిసె వెంకటరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కందుల ముక్కంటి రెడ్డి, ఉస్తెల నారాయణరెడ్డి, మోర్తల సీతారెడ్డితో పాటు పలువురు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR