Devarakonda: 6వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!

Devarakonda: దేవరకొండ పట్టణంలోని 6వ వార్డు జంగలకాలనీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణను మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 22 Nov 2026 7:29 AM IST
Devarakonda
X

Devarakonda: 6వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!

Devarakonda: దేవరకొండ పట్టణంలోని 6వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల ప్రారంభం చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జంగలకాలని నందు మునిసిపల్ కమీషనర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమీషనర్ గారు మాట్లాడుతూ అర్హులైన 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాలు లోపు వయసు కలిగిన ప్రతి కుటుంబం ఈ భీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత బీమా పథకాన్ని వార్డు ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రవికుమార్, RP అంజలి, మునిసిపల్ సిబ్బంది రమాకాంత్, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA