Kodad: చిలుకూరులో 166 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ!

Kodad: కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన 166 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం మంజూరు పత్రాలు అందించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 29 Nov 2026 8:58 PM IST
Kodad
X

Kodad: చిలుకూరులో 166 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ!

కోదాడ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. చిలుకూరు మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన 166 మంది లబ్ధిదారులకు వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD