Suryapet: సూర్యాపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం!
Suryapet: సూర్యాపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో కాంగ్రెస్ నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. నిరుపేదలకు పక్కా ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Suryapet: సూర్యాపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం!
Suryapet: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.
గురువారం సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డు రాజీవ్ నగర్లో కౌన్సిలర్ ఎల్గురి అలివేలు చంటి బాబుతో కలిసి తండు అంజలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
నూతన గృహంలో గృహప్రవేశం చేస్తున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.




