Kodad: అనంతగిరిలో ఘనంగా భారతరత్న ఇందిరా గాంధీ జయంతి!
Kodad: కోదాడ నియోజకవర్గం అనంతగిరిలో గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Kodad: అనంతగిరిలో ఘనంగా భారతరత్న ఇందిరా గాంధీ జయంతి!
కోదాడ: భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం అనంతగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. భూసంస్కరణల ద్వారా పేదలకు భూములు పంపిణీ చేయడంతో పాటు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో దేశ వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కొండపల్లి వాసు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, పాకనాటి రాఘవరెడ్డి, కిష్టాపురం సర్పంచ్ కత్రము జ్ఞానేందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి పాల్గొన్నారు.




