Nalgonda: నల్గొండలో 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహణ!

Nalgonda: నల్గొండలో 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ అనుకూల SIR ప్రక్రియపై మండిపడుతూ ఈనెల 7న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 2 Oct 2026 4:05 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహణ!

Nalgonda:AICC, TPCC పిలుపు మేరకు అక్టోబర్ 2 నుండి 8 వరకు 'సేవ్ డెమోక్రసీ' వారాన్ని పురస్కరించుకుని నల్గొండలోని యాదవ భవన్‌లో 'ఇండియా' కూటమి ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, TJS ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా CEC చేపట్టిన SIR ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా జరుగుతోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

​ఈ క్రమంలో ఈనెల 5న అఖిలపక్ష సమావేశం, 7న క్లాక్ టవర్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, CEC జ్ఞానేష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పగిళ్ల రాజు, పరమేష్, బోడ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda