Marriguda: ఫారెస్ట్‌లో విలువైన మద్ది చెట్ల నరికివేత.. లారీలో కలప తరలింపు!
Marriguda: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో విజిలెన్స్ తనిఖీల రోజే బుగ్గ ఫారెస్ట్ నుంచి భారీగా కలప రవాణా. అనుమానాలకు తావిస్తున్న అక్రమ దందాలపై స్థానికుల ఆరోపణలు.
Marriguda: ఫారెస్ట్‌లో విలువైన మద్ది చెట్ల నరికివేత.. లారీలో కలప తరలింపు!
Marriguda: మర్రిగూడ మండల పరిధిలోని బుగ్గ ఫారెస్ట్ పరిధిలో విలువైన మద్ది చెట్ల నరికివేత, కలప రవాణా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అటవీ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన రోజే రాత్రి సమయంలో భారీగా కలప లోడ్‌తో లారీ కదలడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నల్లగొండ జిల్లా కుదబక్షపల్లి మార్గం నుంచి రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో టీఎస్ 12 యూబీ 9831 నంబరు గల లారీ హైదరాబాద్ వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. సదరు వాహనానికి ముందు, వెనుక ఎస్కార్ట్‌గా ఇతర వాహనాలు వెళ్లడం గమనార్హం. పగటి వేళల్లో నరికిన కలపను అడవిలోనే ఉంచి, రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.




