Maddirala: మద్దిరాల మండల కేంద్రంలో ఐకెపి-1 ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ఐకెపి-1 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తహసీల్దార్ తబిత ప్రారంభించారు.
Maddirala: మద్దిరాల మండల కేంద్రంలో ఐకెపి-1 ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల కేంద్రంలో ఐకెపి-1 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ తబితతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తీగల గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల చేతుల్లో విక్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల బోనస్ ప్రయోజనాలు పొందేలా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు.
రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర, బోనస్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న, గ్రామ సర్పంచ్ రాంపాక నాగరాజు, వ్యవసాయ అధికారి (ఏఓ), ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




