Huzurnagar: హుజూర్ నగర్ తహసీల్దార్‌గా బాశెట్టి హరి ప్రసాద్ బాధ్యతలు!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ)గా బాశెట్టి హరి ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందిస్తామని పేర్కొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 11 Nov 2026 4:27 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్ నగర్ తహసీల్దార్‌గా బాశెట్టి హరి ప్రసాద్ బాధ్యతలు!

హుజూర్ నగర్: హుజూర్ నగర్ తహసీల్దార్ (ఎఫ్‌ఏసీ)గా బాశెట్టి హరి ప్రసాద్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (డీఏఓ)గా విధులు నిర్వర్తించిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హుజూర్ నగర్ తహసీల్దార్‌గా నియామకమయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... మండలంలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా అందిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కష్యపడతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు నూతన తహసీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR