Huzurnagar: దీపావళి బాణసంచా దుకాణాలు భద్రతా నిబంధనలు పాటించాలి!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బాణసంచా దుకాణాల నిర్వహణపై పోలీసు, ఫైర్ అధికారుల సమీక్ష. భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ సుబ్బారెడ్డి హెచ్చరిక.
Huzurnagar: దీపావళి బాణసంచా దుకాణాలు భద్రతా నిబంధనలు పాటించాలి!
Huzurnagar: దీపావళి పండుగను పురస్కరించుకొని తాత్కాలిక బాణసంచా దుకాణాల నిర్వహణ, అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై స్థానిక ఫైర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాణసంచా దుకాణాల నిర్వాహకులతో సమావేశమై పలు భద్రతా సూచనలు చేశారు. దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ప్రాంగణంలోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనల ప్రకారం రేకుల షెడ్లు నిర్మించుకోవాలని సూచించారు. నిప్పు త్వరగా అంటుకునే స్వభావం కలిగిన వస్తువులను దుకాణాల పరిసరాల్లో ఉంచరాదని స్పష్టం చేశారు.
అలాగే విద్యుత్ వైర్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సౌకర్యంతో పాటు ఇసుక, మంటలను ఆర్పే పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. దుకాణాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోరాదని హెచ్చరించారు.
ప్రతి దుకాణ నిర్వాహకుడు అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యాపారాలు నిర్వహించాలని ఎస్‌ఐ సుబ్బారెడ్డి సూచించారు.




