Huzurnagar: గిరిజన డిక్లరేషన్‌ అమలు చేయకపోవడం సిగ్గుచేటు హుస్సేన్ నాయక్

Huzurnagar: కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల గిరిజన డిక్లరేషన్‌ను అమలు చేయకపోవడం సిగ్గుచేటని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్ విమర్శించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 30 Oct 2026 6:13 PM IST
Huzurnagar
X

Huzurnagar: గిరిజన డిక్లరేషన్‌ అమలు చేయకపోవడం సిగ్గుచేటు హుస్సేన్ నాయక్

హుజూర్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌ను ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్ విమర్శించారు.

శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్‌హాల్‌లో గిరిజన గళం – తండాలో నిద్ర యాత్ర చేరుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని, తండా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని, అర్హులైన గిరిజనులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది నగేష్ రాథోడ్ మాట్లాడుతూ తండాల వెనుకబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గిరిజన సంఘాల నాయకులు యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ వెంకట్రాం నాయక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధీరవత్ రవి నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగునాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ రాజేశ్ నాయక్, బాలు నాయక్, శివరాం నాయక్, చక్రు నాయక్, కృష్ణ నాయక్, లావుడియా శ్రీను నాయక్, నాగరాజు నాయక్, నరసింహ నాయక్, సైదా నాయక్, చందు నాయక్, హేమ్లా నాయక్, రాముడు నాయక్, భాష్య నాయక్, చిరంజీవి నాయక్, సురేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలాజీ నాయక్, ఎస్పీ నాయక్, వెంకటేశ్వర్లు నాయక్, బీటెక్ సైదా నాయక్, మట్టపల్లి నాయక్, రాజు నాయక్ తదితర గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR