Huzurnagar: పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. రామస్వామి గట్టు వద్ద పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 6 Nov 2026 10:09 AM IST
Huzurnagar
X

Huzurnagar: పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద పేదల కోసం నిర్మిస్తున్న 2160 ఇళ్ల మోడల్ కాలనీ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. ఈ నెలలోనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ మోడల్ కాలనీ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి అధికారులకు తగిన సూచనలు చేయనున్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR