Huzurnagar: హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఎరగాని నాగన్న గౌడ్!

Huzurnagar: గజ్వేల్ సదస్సులో మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ ఖండించారు. డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 28 Oct 2026 6:55 PM IST
Huzurnagar: హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఎరగాని నాగన్న గౌడ్!
X

Huzurnagar: గజ్వేల్‌లో జరిగిన డీలర్ల రాష్ట్ర సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ అన్నారు. బుదవారం హుజూర్‌నగర్‌లోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు రేషన్ డీలర్ల సమస్యలను పట్టించుకోలేదని, కమిషన్ పెంపు విషయంలోనూ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డీలర్ల ప్రతినిధులను కలిసి వినతిపత్రం స్వీకరించారని, సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయాలు తెలుసుకోకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై హరీష్‌రావు విమర్శలు చేయడం తగదని ఖండించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర డీలర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఎస్‌డీ అజ్మతుల్లా, ప్రధాన కార్యదర్శి గుండు గురవయ్య, యూనియన్ నాయకులు రాగం లింగయ్య, మామిడి కాశయ్య, పేరబోయిన వెంకటేశ్వర్లు, అర్వపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR