Huzurnagar: అంతర్జాతీయ ఆర్ట్ పోటీల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు!
Huzurnagar: అంతర్జాతీయ ఆర్ట్ పోటీల్లో హుజూర్‌నగర్ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. 3 గోల్డ్ మెడల్స్, 7 జ్యూరీ అవార్డులు సాధించడంతో ప్రిన్సిపాల్ అభినందించారు.
Huzurnagar: అంతర్జాతీయ ఆర్ట్ పోటీల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు!
Huzurnagar: అంతర్జాతీయ ఆర్ట్ పోటీల్లో హుజూర్‌నగర్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన యంగ్ ఎన్వాయ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన Fragrance of Art Buds – International Exhibition of Child Art 2026 పోటీల్లో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు 3 మహాత్మా గాంధీ గోల్డ్ మెడల్స్, 7 ఇంటర్నేషనల్ జ్యూరీ అవార్డులు, 14 డిప్లొమా ఆఫ్ డిస్టింక్షన్ అవార్డులు లభించాయి.
గోల్డ్ మెడల్స్‌ను 10వ తరగతి విద్యార్థి సాయి నవీన్, 9వ తరగతి విద్యార్థి గోపి, PGT మ్యాథ్స్ ఉపాధ్యాయుడు మైనం రాజశేఖర్ సాధించారు. పాఠశాల ఆర్ట్ టీచర్ డాక్టర్ నాగజాను సూరేపల్లికి ఇంటర్నేషనల్ డిప్లొమా ఆఫ్ హానర్ అవార్డు దక్కింది.
విద్యార్థుల్లోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించిన ఆర్ట్ టీచర్‌ను ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ సందర్భంగా విజేతలకు అవార్డులు ప్రదానం చేసి, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ విజయాలు పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ హర్షం వ్యక్తం చేశారు.




