Huzurnagar: ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ప్రమాదాలు.. జనం ఆందోళన!

Huzurnagar: హుజూర్‌నగర్‌లోని పొట్టి శ్రీరాములు సెంటర్, ఇందిరా చౌక్‌లలో రోడ్ల ఆక్రమణలతో ప్రమాదాలు. ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 29 Oct 2026 7:22 PM IST
Huzurnagar
X

Huzurnagar: ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ప్రమాదాలు.. జనం ఆందోళన!

హుజూర్‌నగర్: పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌,ఇందిరా చౌక్,సాయిబాబా థియేటర్ రోడ్డు, లింగగిరి రోడ్డు ఇతర ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇటీవల ప్రధాన రోడ్లపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి రోడ్డుపై వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే పొట్టి శ్రీరాములు సెంటర్లో పాత బస్టాండ్‌, పోస్టాఫీస్‌, గ్రంథాలయం వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి. ఇంతటి రద్దీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, నేరుగా రోడ్డుపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వ్యాపారాలు, ఇష్టానుసారంగా వాహనాల రాకపోకల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతూ ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపై వ్యాపారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణలను తొలగించాలి!

పొట్టి శ్రీరాములు సెంటర్‌లో మరియు ఇందిరా చౌక్,లింగగిరి రోడ్డు లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వ్యాపారులపై సంబంధిత మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫుట్‌పాత్‌లను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రహదారులపై ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR