Huzurnagar: పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదం.. 70 ఏళ్ల వృద్ధుడి దుర్మరణం!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో స్కూల్ బస్సు ఢీకొని రమణయ్య అనే వృద్ధ రిక్షా కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Huzurnagar: పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదం.. 70 ఏళ్ల వృద్ధుడి దుర్మరణం!
Huzurnagar: హుజూర్ నగర్ పాత బస్టాండ్ సమీపంలో ప్రమాద వశాత్తూ జరిగిన ఘటనలో రిక్షా కార్మికుడు మృతి చెందారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన రిక్షా కార్మికుడు రమణయ్య (70) రోజువారి పనిలో భాగంగా తన రిక్షా ద్వారా ఉల్లిగడ్డల బస్తా వేసుకొని రోడ్డు దాటుతుండగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పాఠశాలకు చెందిన బస్సు ముందుభాగం బలంగా ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పంచనామ కోసం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు ను డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




